ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యల గుంతలో పడి గిరిజనుడి మృతి

ABN, First Publish Date - 2020-12-02T04:15:36+05:30

రొయ్యల గుంతల వద్ద కాపలాకు వెళ్లిన ఓ గిరిజనుడు ప్రమాదవశాత్తు అదే రొయ్యల గుంతలో పడి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, డిసెంబరు 1: రొయ్యల గుంతల వద్ద కాపలాకు వెళ్లిన ఓ గిరిజనుడు ప్రమాదవశాత్తు అదే రొయ్యల గుంతలో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ చిన్న బలరామయ్య కథనం మేరకు.. అల్లూరులోని ఆర్‌డీఆర్‌ కాలనీకి చెందిన ఏకుల శీనయ్య (46) కొంతకాలంగా ఉడ్‌హౌస్‌పేట-కప్పరాళ్లతిప్ప రోడ్డు సమీపంలోని రొయ్యల గుంతల వద్ద కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం యధావిధిగా కాపలాకు వెళ్లాడు. సాయంత్రం గుంతల వద్దకు వచ్చిన యజమానికి శీనయ్య కనిపించకపోవడం, గుంతల సమీపంలో అతని చొక్కా, ఫోన్‌ ఉండడంతో ఆయన అతని కుటుంబ సభ్యులను పిలిపించి ఆ విషయం చెప్పాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శీనయ్య కోసం రొయ్యల గుంతల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం వేకువజామున శీనయ్య మృతదేహం అదే గుంతలో పైకి తేలడంతో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని వెలుపలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-02T04:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising