ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలేరి!?

ABN, First Publish Date - 2020-04-05T09:47:50+05:30

కరోనా ప్రభావం ఉద్యాన పంటలపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలో వేల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు సాగవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోత దశలో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు

పంటను వదిలేస్తున్న ఉద్యాన రైతులు


నెల్లూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా ప్రభావం ఉద్యాన పంటలపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలో వేల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు సాగవుతున్నాయి. ప్రస్తుతం వాటిలో చాలా వరకు కోతకు వచ్చాయి. అయితే రెండు వారాలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో చేతికొచ్చిన పంటను కోసేందుకు కూలీల్లేక రైతులు అవస్థ పడుతున్నారు. ఎలాగోలా కోత కోసినా రవాణా, మార్కెటింగ్‌ వసతుల్లేక, ఆశించిన ధరలు రాక లబోదిబోమంటున్నారు. గూడూరు డివిజన్‌లో నిమ్మసాగు ఎక్కువ. కానీ చాలా చోట్ల పంటను కోసేందుకు కూలీలు దొరక్క నిమ్మ కాయలు పండ్లుగా మారి రాలిపోతున్నాయి. అలా పండిన వాటిని మార్కెట్‌కు తీసుకువస్తే సగం రేటు కూడా దక్కడం లేదు.


ఉదయగిరి నియోజకవర్గంలో బత్తాయి పంట పరిస్థితీ ఇలాగే ఉంది. కూలీలు లేక, కొనేవారు రాకపోవడంతో చాలా మంది రైతులు కాయలను చెట్లకే వదిలేశారు. ఇక కోట, వాకాడు, చిట్టమూరు, నెల్లూరు రూరల్‌ వంటి మండలాల్లో పుచ్చ రైతులు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. మిరప, టమోటా, బీర, వంగ వంటి ప్రధానమైన కూరగాయలు వందల ఎకరాల్లో సాగువుతున్నా, వాటికి మార్కెటింగ్‌ వసతి ఉన్నప్పటికీ కోసేందుకు కూలీల్లేకపోవడం, రవాణా కష్టాలు వంటివి రైతులను వెంటాడుతున్నాయి. 

Updated Date - 2020-04-05T09:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising