ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషం తాగి వ్యక్తి ఆత్మహత్య.. అనుమానంతో టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్..

ABN, First Publish Date - 2020-07-10T20:57:35+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం ముగ్గురు మృత్యువాత పడగా, 57 కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు మరణాలు.. 57 పాజిటివ్‌లు!

నెల్లూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

నెల్లూరులోనే 35 కేసులు


నెల్లూరు (వైద్యం) : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం ముగ్గురు మృత్యువాత పడగా,  57 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు నగరంలోనే 35 పాజిటివ్‌ కేసులు రికార్డుకెక్కాయి. దర్గామిట్టలో 5, మూలాపేటలో  4, స్టోన్‌హౌ్‌సపేటలో 3, బాలాజీనగర్‌లో 2, పొదలకూరురోడ్డులో 2, సంతపేటలో 2, హరనాధపురంలో 2, కొండాయపాళెం రోడ్డులో 1, జ్యోతినగర్‌లో 1, వైఎస్సార్‌ నగర్‌లో 1, ఎన్టీఆర్‌ నగర్‌లో 1, మాగుంటలేఅవుట్‌లో 1, బీవీనగర్‌లో 1, నవాబుపేటలో 1, ధనలక్ష్మిపురంలో 1, మన్సూర్‌ నగర్‌లో 1, నవాబుపేటలో 1, ఫత్త్తేఖాన్‌పేటలో 1, వేదాయపాళెంలో 1, రాంజీనగర్‌లో 1, మహాత్మాగాంధీనగర్‌లో 1, కోవూరు మండలం శాంతినగర్‌లో 1, సూళ్లూరుపేటలో 2, టీపీగూడూరులో 1, పొదలకూరులో 1, తాడిపర్తిలో 1, తడ మండలం మాంబట్టులో 1, కామనూరులో 1, టీపీ గూడూరు మండలం వరకవిపూడిలో 1, వెంకటగిరి మండలం పూలమెట్టలో 1, సంగం మండలం వంగల్లులో 1, ఇందుకూరుపేటలో 2, వెంకటాచలంలో 1, కావలిలో 5, అనంతపురం, తిరుపతి ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్‌ సోకింది. 


అలాగే, నెల్లూరులోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి నారాయణ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. నెల్లూరు రూరల్‌ మండలం మాదరాజుగూడూరుకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి నారాయణ ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెత్‌తో గురువారం మృత్యువాత పడ్డాడు, ఇతనికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పరీక్షల్లో వెల్లడైంది. నెల్లూరు మన్సూర్‌ నగర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఈ నెల 5వ తేదీన పాయిజన్‌ తీసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 7వ తేదీ మృతి చెందాడు ఈయనకు కరోనా పరీక్షలు చేయగా  పాజిటివ్‌ వచ్చింది. ఇదిలాఉంటే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి 21 మంది, నారాయణ ఆసుపత్రి నుంచి ఆరుగురు మొత్తం 27 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2020-07-10T20:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising