ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో.. 50వేలు దాటిన కేసులు

ABN, First Publish Date - 2020-09-23T17:37:47+05:30

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 50 వేల మైలురాయి దాటేసింది. రాష్ట్రంలోనే 50 వేల పాజిటివ్‌లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో జిల్లాకు 4వ స్థానం

ఈ నెలలో ఇప్పటిదాకా 16,795 కేసులు

కొత్తగా 556 పాజిటివ్‌ల నమోదు 

620 మంది డిశ్చార్జి


నెల్లూరు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 50 వేల మైలురాయి దాటేసింది. రాష్ట్రంలోనే 50 వేల పాజిటివ్‌లు దాటిన జిల్లాగా నెల్లూరు నాల్గవ స్థానంలో ఉంది. ప్రతి రోజు 5వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుం డగా, ఇందులో 500కు పైగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. మార్చి నెలలో తొలి పాజిటివ్‌ కేసు నమోదవగా జూన్‌ నుంచి  కేసుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నెలలో ఇప్పటివరకు 16,795 కరోనా కేసులు నమోదు అయ్యా యి. ఈ నెలాఖరులో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా నమోదు కేసుల సంఖ్య కలవరపెడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 


ముగ్గురి మృతి

తాజాగా మంగళవారం 556 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,250కు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకోలేక నెల్లూరు, కోట, కావలిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అలాగే ప్రభు త్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ, నెల్లూరు ఆసుపత్రితో పాటు, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ల నుంచి 620 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2020-09-23T17:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising