ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ ఫలాలు పేదలకు అందాలి

ABN, First Publish Date - 2020-10-24T11:29:53+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని కలెక్టర్‌ కేవీఎన్‌. చక్రధర్‌బాబు అన్నారు. పడుగుపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరు చక్రధర్‌బాబు 


కోవూరు, అక్టోబరు 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని కలెక్టర్‌ కేవీఎన్‌. చక్రధర్‌బాబు అన్నారు. పడుగుపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు కృషి చేయాలని కోరారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో కొవిడ్‌పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సచివాలయాల్లోని పలు రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సచివాలయ సమస్యలను పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి, తహసీల్దారు సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి, పంచాయితీరాజ్‌ ఏఈ పరమేశ్వర లింగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising