ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రథమ చికిత్సకు అనుమతి ఇవ్వండి

ABN, First Publish Date - 2020-08-12T10:48:19+05:30

జిల్లాలో గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంపీ అసోసియే షన్‌ కలెక్టర్‌ను కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌కు పీఎంపీల వినతి


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 11 : జిల్లాలో గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంపీ అసోసియే షన్‌ కలెక్టర్‌ను కోరింది. ఈ మేరకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. పీఎంపీ సంఘం జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో గతనెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రఽథమ చికిత్స ఆపేశామన్నారు.


అయితే గ్రామాల్లో వైద్యం చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు లేని వారికి వైద్యం అందించేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి కలెక్టర్‌ పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్‌ సత్తార్‌, దేవరకొండ శ్రీనివాసులు, రామదాసు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T10:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising