ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల ప్రోత్సాహానికే సీఎం కప్‌ పోటీలు

ABN, First Publish Date - 2020-02-23T05:54:13+05:30

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి మినీస్టేడియానికి నిధులు మంజూరు చేయిస్తా ఫ రాష్ట్ర క్రీడాభివృద్శి శాఖ మంత్రి శ్రీనివాస్‌


కావలి, ఫిబ్రవరి22: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తున్నారని రాష్ట్ర క్రీడాబివృద్ధిశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌  అన్నారు. పొదలకూరులో సీఎంకప్‌ రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధిలో భాగంగా సీఎం ఒక్కో జిల్లాలో ఒక్కో క్రీడను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కావలి పట్టణంలో కొన్నేళ్లుగా నిర్మాణానికి నోచుకోని మినీస్టేడియం గురించి ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్లగా అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. బోగోలు మండలం జువ్వలదిన్నెలో పర్యాటక కేంద్రం విషయం కూడా ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


మంజూరుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. కావలి రూరల్‌మండలం తుమ్మలపెంట వద్ద ఉన్న పర్యాటక కేంద్రం అభివృద్ధికి కూడా కృషిచేస్తాని తెలిపారు. క్యాక్రమంలో ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఆఫ్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, కుందుర్తి కామయ్య, బాల మురళీ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T05:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising