సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా, అంగన్‌వాడీలు నిరసన
ABN, First Publish Date - 2020-12-31T03:24:15+05:30
నియోజకవర్గంలో అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వలంటీర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఉదయగిరి రూరల్, డిసెంబరు 30: నియోజకవర్గంలో అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వలంటీర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరి చేరనీయకపోవడం దారుణమన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితలో ఉన్నా వాటిని తొలగిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వలంటీర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతోపాటు అమ్మఒడి పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం తహసీల్దారు హరనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2020-12-31T03:24:15+05:30 IST