బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు రాక
ABN, First Publish Date - 2020-12-29T04:40:55+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సూళ్లూరుపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు.
సూళ్లూరుపేట, డిసెంబరు 28 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సూళ్లూరుపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో వీర్రాజు రాక ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే భాగంలో వీర్రాజు ఇక్కడకు వస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎంకేఎం కల్యాణ మండపంలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నట్టు తెలిపారు.
న
Updated Date - 2020-12-29T04:40:55+05:30 IST