ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సి‘ఫార్సు’ బదిలీలు

ABN, First Publish Date - 2020-07-12T10:35:48+05:30

ఒక వైపు కౌన్సెలింగ్‌ కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సిఫార్సుతో ఇద్దరి బదిలీలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్ల కౌన్సెలింగ్‌ జరగకముందే..

మార్గదర్శకాల బేఖాతరు

ఇద్దరి బదిలీపై విద్యాశాఖ ఉత్తర్వులు

ఆందోళనలో ఉపాధ్యాయ సంఘాలు


నెల్లూరు(విద్య) జులై 11 : ఒక వైపు కౌన్సెలింగ్‌ కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సిఫార్సుతో ఇద్దరి బదిలీలు జరిగాయి. తాజాగా ప్రభుత్వం నుంచి ఆ మేరకు  ఉత్తర్వులు జిల్లాకు వచ్చాయి. దాంతో సాధారణ ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. త్వరలో జరగాల్సిన కౌన్సెలింగ్‌తో ఎలాంటి సంబంధం లేకుండానే ప్రభుత్వ సిఫార్సుతో బదిలీలు జరిగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఉపాధ్యాయులు నేతల సిఫార్సులతో ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీకి ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల  చేసింది. ఈ కోవలో అత్యధికంగా రాజకీయ నేతల బంధువులు, సన్నిహితులు, వ్యాపారుల సతీమణులు ఉన్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఇద్దరు బదిలీపై ఉత్తర్వులు

త్వరలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు భిన్నంగా జిల్లాలో ఇద్దరు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను బదిలీ చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. కొండాపురం మండలం సాయిపేట(బీసీ) ఎంపీపీఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న పి.శివకళ్యాణ్‌ను అల్లూరు మండలం సింగారెడ్డిదిన్నె ఎంపీపీఎస్‌ పాఠశాలకు బదిలీ చేశారు. పెళ్లకూరు మండలం రోసనూరు ఎంపీపీఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న జె.లక్ష్మిని బదిలీ చేస్తూ ఆమె నాలుగు పాఠశాలలను కేటాయించారు. వాటిలో ఇందుకూరుపేట మండలం పల్లిపాడు బీసీ కాలనీలోని ఎంపీపీఎస్‌ పాఠశాల, హరిజనవాడ ఎంపీపీఎస్‌ పాఠశాల, నెల్లూరు రూరల్‌ మండలం  ఆర్‌జీఆర్‌నగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాల, నారాయణరెడ్డిపేట ఎంపీపీఎస్‌ పాఠశాల ఉన్నాయి. ఆమె ఎక్కడకు బదిలీ కావాలంటే అక్కడకు బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


సిఫార్సు బదిలీలు మానుకోవాలి

సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం దొడ్డిదారిన ప్రత్యేక ఉత్తర్వులతో బదిలీలు చేపట్టడం దుర్మార్గం.  ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టాల్సి  ఉండగా సిఫార్సు బదిలీలు చేస్తోంది. రాజకీయ పలుకుబడి లేనందును ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలి.

చిట్టేటి రమేష్‌, బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి 

Updated Date - 2020-07-12T10:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising