ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధేయతకు.. పనితీరుకు పట్టం.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీద రవిచంద్ర

ABN, First Publish Date - 2020-10-20T17:48:30+05:30

విశ్వసనీయత.. విధేయతకే తెలుగుదేశం అధిష్ఠానం పట్టం కట్టింది. సామాన్య కార్యకర్త గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బీద రవిచంద్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(ఆంధ్రజ్యోతి): విశ్వసనీయత.. విధేయతకే తెలుగుదేశం అధిష్ఠానం పట్టం కట్టింది. సామాన్య కార్యకర్త గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బీద రవిచంద్ర అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నియ్యారు. 1990లో అల్లూరు మండల తెలుగు యువత కార్యదర్శిగా పార్టీలోకి అడుగుపెట్టిన రవిచంద్ర తక్కువ కాలంలోనే సమర్థ నా యకుడిగా గుర్తింపు పొందారు. 2000 నుంచి 2010 వరకు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007-08లో రాష్ట్ర పార్టీ సహా య కార్యదర్శిగా, కడప జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా, 2011లో ఏలూ రు, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తగా, 2008 నుంచి 2014 వరకు ఆరేళ్లపాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక నెల్లూరులో వరుసగా ఎనిమిదేళ్లపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.


ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని..

మూడు దశాబ్దాల రాజకీయంలో బీద ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 2001 జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో ఒక్క ఓటుతో ఓటమి చెందినా, 2012 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైనా, రెండు, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చేజారిపోయినా.. అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేశారు. తన సేవలతో అధిష్ఠానం మెప్పు పొంది ఎమ్మె ల్సీ అయ్యారు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ వర్గాలు, అనుబంధ సంస్థలతో రవిచంద్ర మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. సీనియర్లు.. బలమైన నాయకులు ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడి హోదాలో పార్టీని ముందుకు నడిపించారు. ఇవన్నీ ఆయన్ను జాతీ య పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేయడానికి ఉపయోగపడ్డాయి. రవిచంద్రకు జాతీయ పార్టీలో సముచిత స్థానం లభించడం పట్ల జిల్లా టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


సోమిరెడ్డికి మరోసారి..

సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి టీడీపీ పోలిట్‌బ్యూరోకు ఎంపికయ్యారు. 2012 నుంచి ఈయన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలపై అవగాహన, పట్టు, వాగ్దాటి కలిగిన సోమిరెడ్డి ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేశారు. రాజకీయ విపక్షాలను ఎన్నో అంశాలపై నిలదీశారు. రాజకీయంగా పాలనాపరంగా విశేష అనుభవం కలిగిన సోమిరెడ్డి సేవలను పార్టీ విధాన నిర్ణయాలు, కార్యక్రమాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించే పొలిట్‌బ్యూరోలో కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం పట్ల టీడీపీ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.  

Updated Date - 2020-10-20T17:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising