ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంరోజులు నీటిలో మునిగినా మొలకొస్తుంది

ABN, First Publish Date - 2020-11-28T04:45:47+05:30

నారుమడిలో పొడివిత్తనం వేసినపుడు వారం రోజులు నీటిలో మునిగి ఉన్నప్పటికీ ఆ తరువాత నీరు తీసివేస్తే యఽథావిధిగా మొలక వస్తుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు


నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 27 : నారుమడిలో పొడివిత్తనం వేసినపుడు వారం రోజులు నీటిలో మునిగి ఉన్నప్పటికీ ఆ తరువాత నీరు తీసివేస్తే యఽథావిధిగా మొలక వస్తుందని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ యు వినీత, డాక్టర్‌ పీ మధుసూదన్‌, రైతు శిక్షణ కేంద్రం డీడీ శివన్నారాయణ తెలిపారు. తోటపల్లిగూడూరు మండలంలోని పేడూరు, కోవెరపాళెం, దేవుళ్లమిట్ట, తోటపల్లిగూడూరు గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. మొలక కట్టిన విత్తనాన్ని మడిలో చల్లినపుడు 3-4 రోజులు పొలంలో నీరు నిల్వ ఉన్నా వెంటనే నీటిని తీసేస్తే మొలక వస్తుందని 4రోజులకు మించి నీరు నిల్వ ఉన్నప్పుడు మొలకశాతం దెబ్బతింటుందని చెప్పారు. నారుమడి, నాటిన వరి మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి నాలుగు రోజులకు మించి ఉంటే పాచిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నారు. కొంతవరకు ఆకుల కొసలు నీటిమట్టంపైన కనబడుతూ ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత పూర్తిగా నీటిని తీసేసి ఎకరానికి 20కిలోల యూరియా, 10కిలోల పొటాష్‌ ఎరువును వేయాలన్నారు. కార్బండిజం మందును లీటరు నీటికి 1గ్రా చొప్పున పిచికారి చేస్తే కుళ్లుడు వంటి తెగుళ్లు రాకుండా నివారించవచ్చన్నారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి గీత, పలువురు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T04:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising