పారిశ్రామికాభివృద్ధికి ఏపీఎస్‌ఎఫ్‌సీ అండ
ABN, First Publish Date - 2020-08-22T10:33:36+05:30
పారిశ్రామికవేత్తలకు 64 ఏళ్లుగా ఏపీఎస్‌ఎఫ్‌సీ ( ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆ సంస్థ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ వెం
నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ వెంకట మహేష్
నెల్లూరు (వెంకటేశ్వరపురం), ఆగస్టు 21 : పారిశ్రామికవేత్తలకు 64 ఏళ్లుగా ఏపీఎస్‌ఎఫ్‌సీ ( ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆ సంస్థ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ వెంకట మహేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నెల్‌కాస్ట్, అరబిందోతో పాటు పలు కంపెనీలు అభివృద్ధి చెందడానికి ఆర్థిక సహకారం అందించామన్నారు. పలు పరిశ్రమలు ఉత్పత్తిని పెంచుకునేందుకు రుణాలను అందించడంలో నెల్లూరు జిల్లా బ్రాంచ్ ముందు వరుసలో నిలిచిందన్నారు.
ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు వర్తింపచేస్తూ పరిశ్రమ లకు అవసరమైన అధునాతన పరికరాలను కొనుగోలు చేసుకొనేందుకు ఏపీఎస్‌ఎఫ్‌సీ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఏపీఐఐసీలోని పలు ఇండ్రస్ట్రియల్ పార్కుల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటును అందించామన్నారు. పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కావాలంటే నెల్లూరు నిప్పో కూడలితో తమ బ్రాంచ్‌ని సంప్రదించాలని కోరారు.
Updated Date - 2020-08-22T10:33:36+05:30 IST