ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో 8 కంటైన్మెంట్‌ క్లస్టర్లు

ABN, First Publish Date - 2020-05-28T11:06:51+05:30

కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ తాజా నిబంధనల మేరకు నెల్లూరు నగరంలో ఎనిమిది ప్రాంతాలను కంటైన్మెంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హాట్‌స్పాట్‌ నుంచి 400 మీటర్ల వరకు ఆంక్షలు
  • మాల్స్‌, థియేటర్స్‌, టీ, కూల్‌డ్రింక్స్‌ వ్యాపారాలకు అనుమతి లేదు
  • మిగిలినవన్నీ తెరుచుకోవచ్చు
  • నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌  


నెల్లూరు,(వెంకటేశ్వరపురం), మే 26 : కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ తాజా నిబంధనల మేరకు నెల్లూరు నగరంలో ఎనిమిది ప్రాంతాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ ప్రకటించారు. నెల్లూరు కమిషనర్‌ బాపిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డితో కలసి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాజాగారివీధి, సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌, స్టోన్‌హౌస్‌పేట, కుక్కలగుంట, రామ్‌నగర్‌, జెండావీధి, కోటమిట్టలోని అలీనా స్ట్రీట్‌, చంద్రబాబు నగర్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించామని చెప్పారు. కరోనా కేసు నమోదైన రోజు నుంచి 28 రోజుల వరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా పరిగణిస్తామన్నారు. ఆ క్లస్టర్‌లో హాట్‌స్పాట్‌ నుంచి 200 మీటర్ల వరకు కోవిడ్‌ జోన్‌గా, అక్కడి నుంచి 200 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌గా పరిగణిస్తామన్నారు. బఫర్‌జోన్‌ బయట అన్ని వ్యపారాలు ఉదయం 7 నుంచి  రాత్రి  7 వరకు చేసుకోవచ్చని తెలిపారు. బుధవారం నుంచి వస్త్ర, ఆభరణాల, ఫుట్‌వేర్‌ దుకాణాలకూ అనుమతి ఇచ్చారన్నారు. అయితే మాల్స్‌, సినిమా థియేటర్స్‌తోపాటు టీ, జ్యూస్‌, కూల్‌డ్రింక్‌ షాపులు, సర్వీస్‌ వ్యాపారాలకు అనుమతి లేదన్నారు. వాటి వలన కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేదని వివరించారు. జెండావీధి ప్రాంతంలో కేసు నమోదై 28 రోజులు పూర్తి అయినందున కలెక్టర్‌ అనుమతితో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి తొలగిస్తామన్నారు. వారం రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో 28 రోజులు పూర్తి కానున్నదని చెప్పారు.

Updated Date - 2020-05-28T11:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising