ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం విధానాలకు నిరసనగా సమ్మె

ABN, First Publish Date - 2020-11-14T05:09:31+05:30

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్మిక సంఘాల నేతలు


నెల్లూరు (వైద్యం), నవంబరు 13 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మె  చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కమిటీ కార్యదర్శి మోహన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమంటోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య, నేతలు అంజనేయులు, రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దొడ్డిదారిన ప్రజావ్యతిరేక సంస్కరణలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, సీఐటీయూ నేతలు నాగేశ్వరరావు, పరంధామయ్య, నగేష్‌, కట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T05:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising