ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం
ABN, First Publish Date - 2020-11-03T09:28:37+05:30
‘ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఒక్క నెల్లూరు జిల్లలోనే సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల
నెల్లూరు జిల్లాలో 700 కోట్ల దోపిడీ...
కేంద్ర మంత్రికి గల్లా ఫిర్యాదు
న్యూఢిల్లీ, అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఒక్క నెల్లూరు జిల్లలోనే సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేరకు కుంభకోణం జరిగింది. ఒక్క జిల్లాలోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత భారీ కుంభకోణం జరిగిందో? తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి’’ అని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు సోమవారం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ‘‘రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనాలను మించి నెల్లూరు జిల్లాలో వరి రెండవ పంట దిగుబడి 8 లక్షల టన్నులు ఎక్కువగా వచ్చింది. ధాన్యం సేకరణ గడువు అక్టోబరు నెలాఖరు వరకూ ఉన్నప్పటికీ సేకరణ కేంద్రాల నుంచి కేవలం 3 లక్షల టన్నులు.. కేవలం 40 శాతం మాత్రమే సేకరించారు.
మిగిలిన 60 శాతం ధాన్యాన్ని మిల్లర్లు, దళారీలు, స్థానిక కొనుగోలు అధికారుల లోపాయికారీ ఒప్పందాలతో కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధరకన్నా చాలా తక్కువకే కోనుగోలు చేశారు. దీనికితోడు ప్రతి పుట్టికి (సుమారు 850 కిలోలు) తరక నెపంతో 200 నుంచి 300 కిలోల మేరకు అదనంగా తీసుకున్నారు. ధాన్యం సేకరణ డేటా, ఏపీ పౌరసర ఫరాల సంస్థ డేటాబే్‌సతోపాటు సాగు డేటా వివరాలను పరిశీలిస్తే ఈ అక్రమాలన్నీ బట్టబయలవుతాయి’’ అని గల్లా లేఖలో వివరించారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అవినీతినిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు.
Updated Date - 2020-11-03T09:28:37+05:30 IST