ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక నెగెటివ్‌ మార్కుల్లేవు.. 40% వస్తే పాస్‌..

ABN, First Publish Date - 2020-09-26T11:41:57+05:30

పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం శాఖాపరమైన పరీక్షలు రాసే ఉద్యోగులకు.. ఆయా పరీక్షల్లో ఇకపై నెగిటివ్‌ మార్కులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం శాఖాపరమైన పరీక్షలు రాసే ఉద్యోగులకు.. ఆయా పరీక్షల్లో ఇకపై నెగిటివ్‌ మార్కులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఉత్తీర్ణత విషయంలో ఇప్పుడున్న 35% మార్కులను 40శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఈ నిబంధన 1965 నుంచి 2016 వరకు అమల్లో ఉంది. అయితే, 2017లో నెగిటివ్‌ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 35% మార్కులకు తగ్గించారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఏపీపీఎస్సీ కార్యదర్శి దీనిపై రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది. ఇదిలావుంటే, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, ఇతర ఆరోపణలకు సంబంధించి నడుస్తున్న శాఖాపరమైన విచారణలను వీడియో కాన్ఫరెన్సు(వీసీ) ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-09-26T11:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising