ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి మళ్లీ ఇంటింటి సర్వే: సీఎస్‌

ABN, First Publish Date - 2020-04-08T10:09:05+05:30

కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరణ, పరీక్షల నిర్వహణ, కంటైన్మెంట్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరణ, పరీక్షల నిర్వహణ, కంటైన్మెంట్‌ ఆస్పత్రుల సన్నద్ధత అత్యంత ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. కరోనా వైర్‌సపై మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరోసారి ఇంటింటి సర్వే ప్రక్రియను 3రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 


అద్దెకు వెంటిలేటర్లు

కరోనా రోగుల కోసం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రయివేటు ఆస్పత్రుల్లోని వెంటిలేటర్లను రాష్ట్ర, జిల్లాస్థాయి ఆస్పత్రులకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దానికి సరిపడా అద్దె చెల్లించేందుకు అంగీకరించింది. కాగా, కరోనా సహాయక చర్యల్లో ఇతర శాఖలకు మాదిరిగానే అటవీశాఖలోని అన్ని స్థాయిల యూనిఫాం సిబ్బంది విధిగా పాల్గొనాలని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రతీ్‌పకుమార్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-04-08T10:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising