ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలి: వెంకయ్య
ABN, First Publish Date - 2020-12-29T08:19:28+05:30
ప్రకృతి అందించిన సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
గన్నవరం, డిసెంబరు 28: ప్రకృతి అందించిన సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతితో స్నేహంగా ఉండకపోతే సమాజమంతా నష్టపోవాల్సి వస్తుందని, దానికి తార్కాణాలు ఎన్నో మనముందుకు వచ్చాయని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి సీఫెట్ కళాశాల విద్యార్థులతో సోమవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ ఉపయోగంలోకి తేవటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపెట్ అధికారులకు వెంకయ్యనాయుడు సూచించారు. త్వరలో నెల్లూరు జిల్లాలో సీపెట్ సంస్థను ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు.
Updated Date - 2020-12-29T08:19:28+05:30 IST