పోలవరానికి 55,548 కోట్లూ ఇవ్వండి
ABN, First Publish Date - 2020-11-03T08:51:59+05:30
జాతీయ హోదా ప్రాజెక్టు పోలవరానికి రూ.55,548.87 కోట్లనూ మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌ను రాష్ట్ర రై
పీపీఏ సీఈవోకు రైతు సంఘాల వినతి
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ హోదా ప్రాజెక్టు పోలవరానికి రూ.55,548.87 కోట్లనూ మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌ను రాష్ట్ర రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్, కొల్లి నాగేశ్వరరావు, టి.లక్ష్మీనారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో అయ్యర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రూ.55,548,87 కోట్ల తుది అంచనాలను కేంద్ర జల సంఘం పరిధిలోని టీఏసీ అధ్యయనం చేసి ఆమోదించినందున.. ఈ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు.
Updated Date - 2020-11-03T08:51:59+05:30 IST