ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ జైలుకు వెళ్లడం వల్లే సీఎం అయ్యారు: నారాయణ

ABN, First Publish Date - 2020-09-29T17:12:58+05:30

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నిరసన దీక్ష నిర్వహించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నిరసన దీక్ష నిర్వహించాయి. నిరసన దీక్షలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేటు కంపెనీలకు కొమ్ము కాస్తోందన్నారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందన్నారు. 


రాబోయే రోజుల్లో రైతులు కూలీలుగా మారిపోయే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీల స్వార్థ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో జైలుకు వెళ్ళడం వలన ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని నారాయణ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-29T17:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising