ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కుటుంబాల కష్టాలు చూసి చలించిపోయిన నారా లోకేష్..

ABN, First Publish Date - 2020-12-28T19:43:45+05:30

హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చలించిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చింతలమడ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు సాంబశివరావుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు ఎకరాల్లో కౌలు చేశారని.. తుఫాను కారణంగా పంట మొత్తం దెబ్బతిన్నదని.. అప్పుల బాధతో ఆత్మహత్యకి పాల్పడ్డారని సాంబశివరావు కుటుంబ సభ్యులు లోకేష్‌కి తెలిపారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి సహాయం అందించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి నారా లోకేష్ చలించిపోయారు. అవనిగడ్డలో ఆత్మహత్యలు చేసుకున్న సాంబశివరావు, కృష్ణంరాజు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు సహాయం చెయ్యాలని ఈ సందర్భంగా లోకేష్ నిర్ణయించారు. త్వరలో పార్టీ తరుఫున లోకేష్ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయిలు ఆర్థిక సహాయం అందించనున్నారు.


Updated Date - 2020-12-28T19:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising