ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో పాత్రికేయుల మృతిపై నారా లోకేష్ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2020-08-12T17:51:44+05:30

అమరావతి: కరోనా బారిన పడి నెల్లూరులో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందటం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా బారిన పడి నెల్లూరులో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందటం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందుండి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడి చనిపోవడం బాధాకరమన్నారు. నెల్లూరు జిల్లా సీనియర్ పాత్రికేయులు చక్రపాణి, మూర్తిల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అనేక సార్లు డిమాండ్ చేశానని.. అయినా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిన్న చూపు చూస్తోందన్నారు. పాత్రికేయులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు.


Updated Date - 2020-08-12T17:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising