ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్, ఉల్లి ధరలు తగ్గించలేదు కానీ..: లోకేష్‌

ABN, First Publish Date - 2020-02-20T00:38:22+05:30

అమరావతి: రాజధానిలో భూములను పంపిణీ చేయడం సరికాదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధానిలో భూములను పంపిణీ చేయడం సరికాదని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బుధవారం మంగళగిరిలో లోకేష్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని అభివృద్ధి కోసం రైతులు భూములు ఇచ్చారని.. రైతులకు న్యాయం చేసిన తర్వాతే రాజధాని భూముల జోలికి వెళ్లాలన్నారు. భూసేకరణ చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. విద్యుత్, ఉల్లి ధరలు తగ్గించలేదు కానీ..తమ భద్రత తగ్గించారని ఎద్దేవా చేశారు. మూడు ముక్కల రాజధానిపై సెలక్ట్ కమిటీ నివేదిక ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మండలి చైర్మన్ చెప్పిన దానికి కార్యదర్శి అడ్డు చెప్పడమేంటని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-02-20T00:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising