ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొత్సకు కళ్లు దొబ్బాయా.. రాజధాని మహిళల తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2020-10-12T18:21:34+05:30

రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణాయపాలెంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణాయపాలెంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్నా స్పందించని ప్రభుత్వ తీరుకి నిరసనగా నల్ల బెలూన్లను గాలిలోకి‌ వదిలారు. ఈ కార్యక్రమంలో లోకేశ్, గల్లా జయదేవ్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ..  అమరావతి ఉద్యమానికి పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పేరులో రైతు పేరు పెట్టుకుని రైతులను మోసం చేస్తారా అని ప్రశ్నించారు. ముందు పార్టీ పేరులో రైతు అనే పదం పీకేయండని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతిలో పండుగ చేసుకుంటున్నారని బొత్స అంటున్నారని.. ఆయన కళ్లు ఏమైనా దొబ్బాయా అని ఎద్దేవా చేశారు. ‘‘మమ్మల్ని లకారాలతో మాట్లాడుతున్న వారు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. మేమూ మాట్లాడగలం.. కానీ మాకు మా పెద్దలు సంస్కారం నేర్పారు. రైతు అనే వాళ్లు లేకుంటే... మీకు భవిష్యత్తు లేదనేది గుర్తించండి. రైతులను కన్నీళ్లను పెట్టించిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ మీ మోనార్క్ పాలన ఆపకపోతే.. బుద్ధి చెబుతాం. మేము పెయిడ్ ఆర్టిలమా... డబ్బులు తీసుకుని మాట్లాడే మీరా... పెయిడ్ ఆర్టిస్టులు? ఆనాడు వైసీపీకి మద్దతు ఇస్తే మహిళా రైతు అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ తప్పును ప్రశ్నిస్తే..  నేను  పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నామా? జగన్ మనసు మార్చుకో.. అమరావతినే రాజధానిగా కొనసాగించు’’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-12T18:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising