ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి రాలేదు

ABN, First Publish Date - 2020-04-10T07:18:09+05:30

‘‘ఎన్నో అగచాట్లు పడి చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు. అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేశారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాస్కులు రాలేదు. పీపీఈ డ్రెస్సులూ రాలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేసేశారు
  • మాస్కులు, పీపీఈ డ్రెస్సులు లేవు
  • గ్లౌజులు లేవు.. బూట్లూ లేవు
  • రోజా ఒక్కరే ఆదుకుంటున్నారు
  • మిగిలిన వాళ్లవి ప్రగల్భాలే
  • ప్రభుత్వంపై నగరి కమిషనర్‌ ధ్వజం


తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):  ‘‘ఎన్నో అగచాట్లు పడి చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు. అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేశారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాస్కులు రాలేదు. పీపీఈ డ్రెస్సులూ రాలేదు. గ్లౌజులు లేవు.. బూట్లూ లేవు’’... ఇవి చిత్తూరు జిల్లా నగరి  మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామి రెడ్డి మాటలు! ఆయన స్వయంగా సెల్ఫీ వీడియో తీసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా మంది నేతలు మాస్కులు పంచి ప్రచారం చేసుకుంటున్నారని... వీరంతా రోజాను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియోలో ఇంకా ఏమన్నారంటే... ‘అందరికీ నమస్కారం... కరోనా వైరస్‌ గురించి ప్రపంచమంతా తల్లకిందులవుతోంది.


అన్ని చోట్లా మున్సిపాలిటీల్లో గానీ, పంచాయతీల్లో గానీ కులాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సహాయం చేయుచున్నారు. కానీ నగరి పరిస్థితికి వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే అన్ని విధాలా అన్ని శాఖ లవారికీ సహకరిస్తూ ముందుకు వస్తున్నారు.. మిగతా చోట్ల మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు తమకు నచ్చిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కరు కూడా సాయం చేయడం గానీ, ముందుకు రావడం గానీ లేదు. నగరిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ఇంత అవస్థ పడుతున్నారు. ఎమ్మెల్యే గారే కనుక ఆ సాయం కూడా చేయకపోయి ఉంటే ప్రజల పరిస్థితి ఎలా ఉండేది? అందరికీ భోజనాలు పెట్టిస్తూ ఐదు మండలాలకూ మీకు ఎంత అవసరమో నేను అరేంజ్‌ చేస్తాను.. డబ్బుల విషయం గానీ అని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. అటువంటి ఎమ్మెల్యే ఉండాలి ఎక్కడైనా! మిగతా వారంతా మేము నాయకులమని ఎగబడతారు అన్ని విషయాల్లో.. ఇప్పుడసలు అడ్రసు లేరు. ఇపుడు మా దగ్గరకొచ్చి మాస్కులు తీసుకుంటారు.. కొందరు కుట్టిస్తాము.. ఏదో సేవ చేస్తామని, మాస్కులు పంచుతా ఉండామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేగారికి మా మున్సిపల్‌ శాఖ తరపున, పోలీసు, వైద్య సిబ్బంది తరపున ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాము. ప్రజలందరూ ఆలోచించండి... ఎమ్మెల్యేగారు ఎలా చేస్తున్నారు? మిగతావారు ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఏదో నాలుగు మాస్కులిచ్చేసి ఏదో ఘనకార్యం చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి వీధుల్లోకి మేము, మా సిబ్బంది, పోలీసులు, ఏఎన్‌ఎంలు, డాక్టర్లు అందరం ధైర్యంగా వెళుతున్నాం. మాకు ఎలాంటి మాస్కులు ప్రభుత్వం నుంచీ రాలేదు. పీపీఈ డ్రస్సులు, గ్లవుజులు, బూట్లు లేవు. అయినా పోతున్నాం. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఈ వీడియో పంపుతున్నా’’ అని వెంకట్రామిరెడ్డి తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T07:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising