ఎంపీ రామ్మోహన్‌నాయుడు యోగాసనాలు
ABN, First Publish Date - 2020-06-22T09:36:29+05:30
కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన ఇంట్లోనే
శ్రీకాకుళం, జూన్ 21(ఆంధ్రజ్యోతి) : కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన ఇంట్లోనే జరుపుకొన్నారు. వివిధ ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగసాధన చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
Updated Date - 2020-06-22T09:36:29+05:30 IST