ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో త్వరలో రాజ్యాంగ సంక్షోభం

ABN, First Publish Date - 2020-11-21T09:15:47+05:30

‘‘ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తబోతోంది. రెండు మూడు నెలల్లో రాష్ట్రపతి పాలన విధించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2-3 నెలల్లో రాష్ట్రపతి పాలన విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం

ఇళ్ల స్థలాల పేరుతో మత మార్పిడికి యత్నాలు: ఎంపీ రఘురామరాజు


హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తబోతోంది. రెండు మూడు నెలల్లో రాష్ట్రపతి పాలన విధించి.. స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రమేశ్‌ కుమార్‌ను విమర్శించడానికి మంత్రి కొడాలి నానిని ఒక పరికరంగా వాడుతున్నారు. శునకంతో పోల్చి మాట్లాడించడం చాలా తప్పు. ఇప్పటికైనా నిమ్మగడ్డతో రాద్ధాంతానికి స్వస్తి పలకాలి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు కిస్మస్‌ కానుకగా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఇళ్ల స్థలాల పేరుతో 90 లక్షల మందిని మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీలోని 29,880 మంది పాస్టర్లకు మతప్రచారం కోసం ప్రభుత్వం నెలకు రూ.14.94 కోట్ల చొప్పున ఏటా రూ.715 చెల్లిస్తోందన్నారు. కరోనాతో మృతి చెందిన తిరుపతి ఎంపీ కుటుంబీకులకు టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ కుటుంబానికి అన్యాయం చేసి తన వ్యక్తిగత వైద్యుడైన గురుమూర్తికి సీఎం జగన్‌ టికెట్‌ ఇవ్వడం సమంజసం కాదన్నారు.

Updated Date - 2020-11-21T09:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising