ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆయన సీఎం అవడంతోనే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది’

ABN, First Publish Date - 2020-08-16T03:27:08+05:30

సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వ్యాఖ్యానించారు. జగన్ పాలన విధ్వంసంతోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వ్యాఖ్యానించారు. జగన్ పాలన విధ్వంసంతోనే మొదలైందన్నారు. ప్రజా వేదిక కూల్చివేతే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. శనివారం నాడు ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విజయవాడలో ఇంద్రకీలాద్రి వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. నాడు వైసీపీ సాధ్యం కాదని చెప్పిన ఫ్లై నిర్మాణాన్ని తాము పూర్తిచేసి చూపించామని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం కలిసొచ్చిందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తితో విజయవాడ ప్రజల 20 ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఇదిలాఉండగా, సీఎం జగన్ మాత్రం అన్నింట్లోనూ విఫలమయ్యారని ఎంపీ కేశినేని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, జగన్ ఒక విఫల సీఎం అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-16T03:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising