ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాలకు ‘తాకట్టు భూమి’

ABN, First Publish Date - 2020-07-11T08:35:27+05:30

బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల కోసం సేకరించడమే కాకుండా, నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఘటన గుంటూరులో వెలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకు అప్పు తీర్చకుండానే ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు
  • నకిలీ దస్తావేజులు సృష్టించి నేతలు, అధికారుల కుమ్మక్కు
  • తనఖా భూమికి కోట్లలో చెల్లింపులు
  • బ్యాంకు ఫిర్యాదుతో రంగంలోకి సీబీఐ 
  • ఇంచార్జ్‌ తహసీల్దార్‌ తొలగింపు

గుంటూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల కోసం సేకరించడమే కాకుండా, నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు రైతులతో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి.. కోట్లు పోగేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట, ముత్తాయపాలెం గ్రామాల్లో రైతులు మోదేపల్లి అచ్యుత రామారావు, శ్రీనివాసరావుకు సుమారు 8-9 ఎకరాల భూమి ఉంది. దీనిని వారు గుంటూరులోని లక్ష్మీపురం సెంట్రల్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ1.2 కోట్లు రుణం పొందారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలూ బ్యాంకులోనే ఉన్నాయి. ఇంతలో ‘పేదలకు ఇళ్లు’ పథకం కింద స్థానికంగా అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ క్రమంలో ఈరైతులతో కొందరు అధికార పార్టీ నేతలు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సేకరణ కింద ఈ భూమిని ఇచ్చేశారు.


వాస్తవానికి ఎకరా రూ.15 లక్షల కంటే ఎక్కువ పలకని ఈ భూములను ఎకరం రూ.55-60 లక్షల చొప్పున ప్రభుత్వానికి విక్రయించారు. అయితే రైతులకు ఇచ్చింది.. ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు మాత్రమే.  ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల దృష్టికి రాగా, బ్యాంకు మేనేజరు అరుణ రైతులు, సర్వే రాళ్లు వేసిన అధికారులపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దీంతో మేనేజరు నేరుగా సీబీఐ, ఆర్‌బీఐని ఆశ్రయించారు.  సీబీఐ రంగంలోకి దిగడంతో రెవెన్యూ అధికారులు హడావుడిగా ఇంచార్జి తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగించారు. అమరావతి పోలీసులు కూడా ఇద్దరు రైతులపై కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-11T08:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising