ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిన ప్రజాప్రతినిధి

ABN, First Publish Date - 2020-03-28T20:39:06+05:30

ఓ ప్రజాపతినిధి క్వారంటైన్‌కు వెళ్లారు. తన కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన అప్రమత్తమైనారు. క్వారంటైన్‌ అయ్యేందుకు కుటుంబసభ్యులతో కలిసి జీజీహెచ్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. ఇంతమంది వస్తే ఏర్పాటు చేయలేమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఓ ప్రజాపతినిధి క్వారంటైన్‌కు వెళ్లారు. తన కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన అప్రమత్తమైనారు. క్వారంటైన్‌ అయ్యేందుకు కుటుంబసభ్యులతో కలిసి జీజీహెచ్‌కు వెళ్లారు. ఇంతమంది వస్తే ఏర్పాటు చేయలేమని జీజీహెచ్‌ అధికారులు తేల్చి చెప్పారు. జీజీహెచ్‌ అధికారుల తీరుతో ఆయన అవాక్కయ్యారు. దీంతో తన కుటుంబసభ్యులతో కలిసి కాటూరి ఆస్పత్రికి వెళ్లారు. 


రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం.. ఈ రెండూ లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారానే వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖలో నాలుగు రోజుల క్రితం పాజిటివ్‌గా తేలిన యువకుడి నుంచి అతన తండ్రికి వైరస్‌ సోకగా.. గుంటూరులో కరోనా బాధితుని భార్యకు కూడా ఈ వ్యాధి సోకింది. ఆమె ప్రజాప్రతినిధి చెల్లెలు కావడంతో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెను విజయవాడ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు బాధితునితో అత్యంత సన్నిహితంగా మెలిగిన తొమ్మిది మందిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. బాధితురాలి తల్లిని కూడా గురువారం రాత్రే జీజీహెచ్‌కి తరలించారు.

Updated Date - 2020-03-28T20:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising