ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పథకాల్లో 85 శాతం హిందువులకే లబ్ధి : రోజా

ABN, First Publish Date - 2020-09-14T20:35:52+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. కులాన్ని, మతాన్ని జగన్‌కు ఆపాదించటం తగదని విమర్శలకు ఆమె హితవు పలికారు. ఇవాళ స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్‌లను రోజా విరాళంగా ఇచ్చారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ స్ట్రెచర్‌లను విరాళంగా ఇవ్వడం జరిగింది. వీటి అంచనా విలువ రూ 2.00 లక్షలు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు.


బీజేపీ, జనసేన ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌పై బురద చల్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అంతర్వేది అంశంలో జగన్ సీబీఐ విచారణకు అంగీకరించారన్న విషయాన్ని రోజా మరోసారి గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన ఆమె.. రెండు చోట్ల ఓడిపోయిన ఆయనకు అంతర్వేది విషయంలో మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-09-14T20:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising