ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. ఎమ్మెల్యేపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-04-12T07:34:00+05:30

లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌ ఉల్లంఘనపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు, 9 మంది వైసీపీ నాయకులపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్‌ 11: లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌ ఉల్లంఘనపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు, 9 మంది వైసీపీ నాయకులపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. బుచ్చిలోని డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూలు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీలకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయితే, ఇక్కడ ఎమ్మెల్యే ప్రసన్న, అధికారులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారు. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులతో కలిసి శనివారం బుచ్చి పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ప్రసన్నకుమార్‌రెడ్డి ధర్నా చేశారు. పేదలను ఆదుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కేసులు పెడతారా!? అంటూ నిలదీశారు. 


Updated Date - 2020-04-12T07:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising