ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన...అది ఒక పనికిమాలిన సేన: మంత్రి శంకర్ నారాయణ ఫైర్

ABN, First Publish Date - 2020-08-01T18:24:59+05:30

జనసేన...అది ఒక పనికిమాలిన సేన: మంత్రి శంకర్ నారాయణ ఫైర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జనసేన పార్టీపై రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం జిల్లా పెనుకొండలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన జనం కోసం చేసింది సూన్యమని... అది ఒక పనికిమాలిన సేన అని విరుచుకుపడ్డారు. ప్యాకేజి కోసం పనిచేయడం తప్ప ప్రజల కోసం చేసింది సూన్యమని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సరైన సమయం కాదు అన్న పవన్ కళ్యాణ్‌కు...  షూటింగ్‌లకు సరైన సమయమా అని ప్రశ్నించారు.


చంద్రబాబు నాయుడు కేవలం తన స్వార్థం కోసమే అప్పట్లో అమరావతి రాజధానిగా చేశారని విమర్శించారు.  పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు నిర్ణయిస్తే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి రాజధాని కావాలని రైతులను తప్పుదోవ పట్టించారని మంత్రి ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ, జీఎన్‌రావు కమిటీ అమరావతి రాజధాని అనుకూలం కాదని నివేదిక సమర్పించినా కేవలం తన స్వార్థం కోసమే అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశారని మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-08-01T18:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising