ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులంతా మాస్క్ ధరించాల్సిందే: పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2020-08-06T01:56:09+05:30

ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మట్లాడారు. ‘మాస్క్ లు ధరింపచేసేలా ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు విధిగా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఇందుకుగాను ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలి. గ్రామ వలంటీర్లు నిరంతర పర్యవేక్షణతో ప్రతివారు మాస్క్ ధరిస్తున్నారో లేదో క్షుణ్ణంగా గమనించాలి. ఎవరైనా మాస్క్ ధరించని పక్షంలో వారికి మర్యాదపూర్వకంగా అవగాహన కల్పించాలి. మాస్క్ లేకుండా ఉన్నవారికి గ్రామ పంచాయతీ స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.50లు ఫైన్ విధించొచ్చు. ఈ జరిమానా రుసుమును తిరిగి పారిశుధ్యానికి వినియోగించేలా చూడాలి. గ్రామాల్లో ఏడు రోజులూ కంటిన్యూగా మాస్క్ ధరించటం, సమదూరం పాటించటం, వ్యక్తిగత పరిశుభ్రతపై వాడవాడలా మైక్ ద్వారా అనౌన్స్ చేయాలి. గ్రామంలో ఉండే మసీదు, చర్చ్, గుడి మైక్ సెట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి.’ అంటూ అధికారులకు మంత్రి సూచించారు.

Updated Date - 2020-08-06T01:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising