రోడ్డు కోసం నా సొంత భూమి పోయింది: మంత్రి పెద్దిరెడ్డి
ABN, First Publish Date - 2020-10-01T20:28:42+05:30
రోడ్డు కోసం తన సొంత భూమి పోయిందని, తన ఇంటి ముందు రోడ్డు వేస్తే కూడా తప్పా.. అని..
అమరావతి: రోడ్డు కోసం తన సొంత భూమి పోయిందని, తన ఇంటి ముందు రోడ్డు వేస్తే కూడా తప్పా.. అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ మాజీ జడ్జి తమ్ముడిపై దాడి చేసిన వ్యక్తి.. వైసీపీకి చెందినవాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జి మాటను పట్టుకుని..టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు తీరుతో ఈసారి 23 మంది కూడా గెలవరని పెద్దిరెడ్డి జోష్యం చెప్పారు.
Updated Date - 2020-10-01T20:28:42+05:30 IST