ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అసంతృప్తి.. జగన్ ఆదేశాలతో మరోసారి సమావేశమై..

ABN, First Publish Date - 2020-06-04T23:41:37+05:30

మంత్రి కన్నా బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఆయిల్ కంపెనీల ప్రతినిధుల తీరుపై మంత్రి కన్నా బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు కొలిక్కి రాలేదు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నాడు మరోసారి సమావేశం అయ్యారు. దీంతో ఇవాళ జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్న బాబు, ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంతనాధ రెడ్డి పాల్గొన్నారు.


సమీప రాష్ట్రాల్లో మాదిరిగానే ఓఈఆర్ రేటు నిర్ణయం జరగాలని.. ఆయిల్ కంపెనీలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం సానుకూల ధరను నిర్ణయించాలని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఓఈఆర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంలో చేస్తున్న జాప్యం పట్ల మంత్రి మండిపడ్డారు. ఆయిల్ పామ్ రైతులు ఉత్పాదక ఖర్చులు, కంపెనీల కొనుగోలు తదుపరి ఖర్చులను కన్నబాబు క్షుణ్నంగా పరిశీలించారు. చివరిగా 17.5 ఓఈఆర్ రేటును ఇచ్చేందుకు అతి కష్టంగా ఆయిల్ పామ్ ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-04T23:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising