ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పు ఏదైనా ప్రభుత్వం శిరసా వహించాల్సిందే : మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2020-05-29T21:49:32+05:30

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇవాళ హైకోర్టు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో  ఇవాళ హైకోర్టు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. అనంతరం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును అటు టీడీపీ.. ఇటు బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలూ గుప్పించారు.


శిరసా వహించాల్సిందే..!

తాజాగా ఈ తీర్పుపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. మధ్యాహ్నం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందన్నారు. హైకోర్టు తీర్పు ఏదైనా ప్రభుత్వం శిరసా వహించాల్సిందేనని కూడా చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై హైకోర్టు తీర్పు విషయంలో అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పరోక్షంగా ఆయన సంకేతాలిచ్చారు. తీర్పులో లోటుపాట్లను పరిశీలించి ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ విషయాన్ని మంత్రి బాలినేని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-29T21:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising