టీడీపీ హయాంలో బీసీలను అణగదొక్కారు: బాలినేని
ABN, First Publish Date - 2020-11-03T22:42:58+05:30
తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక బీసీలను ఉన్నత స్థాయికి
ప్రకాశం: తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు పని చేస్తున్నారని చెప్పారు. పదవులు పొందిన వాళ్లు బీసీలను పైకి తీసుకువచ్చేందుకు పని చేయాలని కోరారు. సీఎం జగన్ 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చారని మంత్రి వెల్లడించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్..
పాదయాత్ర సమయంలో బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని మంత్రి సురేష్ గుర్తుచేశారు. బీసీ కార్పోరేషన్లు ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Updated Date - 2020-11-03T22:42:58+05:30 IST