ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజుల్లో టూరిజం పాలసీ విడుదల: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2020-09-27T19:24:13+05:30

ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. టూరిజం ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్టార్‌గా  తయారు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. దేశ, విదేశీ పర్యాటకులను విశాఖ ఆకర్షిస్తుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా పర్యాటక రంగంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మెదలుపెట్టామని చెప్పారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు పర్యాటక రంగం ఆదాయంపై ఆధారపడి ఉన్నాయి. ఏపీలో 13 జిల్లాలో 12 ప్రాంతాలు గుర్తించామని... త్వరలోనే పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో అనుమతులు కోసం లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పర్యాటకశాఖను ఆదాయం తెచ్చే రంగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగం తర్వాత టూరిజాన్ని ఆదాయ వనరుగా మారుస్తామని వెల్లడించారు. మన వద్ద మౌలిక వసతులు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల సమస్యని దీన్ని మరింతగా అధిగమించేందుకు ప్రయత్నం చేస్తామని... వారం రోజుల్లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-27T19:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising