ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్బం హరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి అవంతి

ABN, First Publish Date - 2020-10-03T22:50:15+05:30

టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అక్రమ కట్టడాలని అధికారులు చెబుతుండగా.. ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల తీరు, వైసీపీ ప్రభుత్వంపై సబ్బం తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో అదే విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి.. ‘సబ్బం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. నువ్వు రౌడీ అనుకుంటున్నావా ఏంటి..?’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


ఆక్రమిస్తే విడిచిపెట్టాలా!?

సబ్బం హరి వీధి రౌడీలా మాట్లాడారని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ సిబ్బందిపై సబ్బం దుర్భాషలాడారని మంత్రి ఆరోపించారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని ఆయన హితవు పలికారు. కక్షసాధింపులకు దిగాల్సిన అవసరం తమకు లేదని మంత్రి చెప్పారు.మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా..? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా..?. పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు. విశాఖలో పార్క్‌ స్థలాన్ని సబ్బం హరి కబ్జా చేశారు. విశాఖలో ఆరు నెలల్లో 450 ఆక్రమణలు జరిగాయి. సబ్బం హరి శ్రీరంగ నీతులు వల్లిస్తున్నారు. సబ్బం హరి వీధిరౌడీలా బూతులు మాట్లాడారు. సబ్బం హరిపై మా ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు అని అవంతి చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరికపై మాట్లాడిన అవంతి.. పార్టీలోకి ఎవరు రావాలి..? ఎవరు వెళ్లాలి..? అనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.


ఎవరికైనా చర్యలు తప్పవు..!

మరోవైపు ఎమ్మెల్యే ఆదీప్ రాజు మాట్లాడుతూ.. సబ్బం నోరు అదుపుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన్ను జనాలు హోం క్వారంటైన్‌కు పంపించారని.. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని ఆయన తెలిపారు.


మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సబ్బం హరి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని.. రికార్డులు తారుమారు చేసి స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో కూడా సబ్బం హరి ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయన్న విషయాన్ని కరణం గుర్తు చేశారు. అంతేకాదు సబ్బం భూకబ్జాపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా పోరాటం చేశారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను నిలదీసిన అయ్యన్న ఇప్పుడు.. మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.



Updated Date - 2020-10-03T22:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising