ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల మార్కెట్‌కు అమూల్‌ ఊపు

ABN, First Publish Date - 2020-11-21T08:47:43+05:30

రాష్ట్రం లో అమూల్‌ ప్రాజెక్టును ఈ నెల 26 తేదీన సీఎం జగన్‌ ప్రారంభిస్తారని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి అప్పలరాజు


అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో అమూల్‌ ప్రాజెక్టును ఈ నెల 26 తేదీన సీఎం జగన్‌ ప్రారంభిస్తారని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ‘ఏపీ ప్రభుత్వం- అమూల్‌ప్రాజెక్టు’లో భాగంగా రాష్ట్రంలో 7,125 పాలసేకరణ కేంద్రాలను రూ.1,362 కోట్లతో మూడు ద శల్లో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 8 హార్బర్లను ప్రభుత్వం నిర్మించ తలపెట్టిందని, 4 ఫిషింగ్‌ హార్బర్లకు శనివారం ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అలాగే, 25 ఆక్వా హబ్స్‌ను సీఎం ప్రారంభించనున్నారన్నారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 400 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో ప్రభుత్వ ప్రైవేటు డెయిరీలు లక్షా 60 వేల లీటర్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. 200 లక్షల లీటర్ల పాలు మిగిలిపోతున్నాయి. ఎలాంటి మిగులు లేకుండా నే రుగా ప్రభుత్వమే పాడి రైతుల నుంచి పాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతులకు ఆర్థిక లబ్ధి కలగచేయడమే లక్ష్యంగా ప్రభుత్వమే బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్ల(బీఎంసీ) ద్వారా పాలు కొనుగోలు చేస్తోంది.


అమూల్‌ రాష్ట్రంలో పాల సేకర ణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సహకారం అందిస్తుం ది. 200 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని అమూల్‌ మా ర్కెటింగ్‌ చేస్తుంది’’ అని అప్పలరాజు తెలిపారు. కా గా, వైఎస్సార్‌ చేయూత పథకం కింద పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి లక్షలాది మంది ముందుకొచ్చారని, ఈ పథకం కోసం రూ.5,386 కో ట్లు వెచ్చిస్తున్నామని మంత్రి చెప్పారు. గొర్రెలు, మే కల పెంపకానికి రూ.2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు గొడుగు, దుప్పటి, పాదరక్షలతో కూడిన కిట్లు అందజేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 

Updated Date - 2020-11-21T08:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising