ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేకింగ్: రెండ్రోజులుగా క్వారంటైన్‌లో మంత్రి అనిల్.. టెస్ట్‌లు చేయగా..

ABN, First Publish Date - 2020-04-07T13:55:12+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోని కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో..? ఎటు నుంచి వైరస్ ఎవరికొస్తుందో..? అని భయపడుతూ బతుకుతున్నారు. ఈ క్రమంలో జనాల్లో నిత్యం తిరిగే ప్రజా ప్రతినిధులు సైతం కరోనా టెస్ట్‌లు చేయించుకుని క్వారంటైన్‌కు వెళ్తున్నారు.


ఊపిరి పీల్చుకున్న అనుచరులు..

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత రెండ్రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఏం జరిగిందో ఏమో అని అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే.. అనిల్‌కు తాజాగా కరోనా టెస్ట్‌లు చేయగా నెగిటివ్ అని రావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కరోనా పాజిటివ్ వచ్చిన డాక్టర్‌తో ఆయన గతంలో ఓ కార్యక్రమంలో కలిశారు. దీంతో అనుమానంతో తాజాగా టెస్ట్‌లు చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇవాళ్టి నుంచి యథావిధిగా అనిల్ కుమార్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 


చాలా మంది డాక్టర్స్ క్వారంటైన్‌కు..

మరోవైపు.. పాజిటివ్ వచ్చిన ఆ డాక్టర్ మంత్రి అనిల్‌తో పాటు చాలా మంది డాక్టర్లు, రోగులని కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేట్ డాక్టర్ అని అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రి ప్రారంభోత్సవంలో డాక్టర్లంతా కలిసినట్లు తెలుస్తోంది. ఆ టైమ్‌లో ఆ ప్రైవేట్ డాక్టర్‌ కూడా ఉన్నారని సమాచారం. అయితే ఆయనకు కరోనా ఉన్నట్లు తెలుసుకున్న పలువురు డాక్టర్లలోనూ కలవరం మొదలైంది. ఇదిలా ఉంటే.. ఆ డాక్టర్లంతా స్వచ్చంధంగా క్వారంటైన్‌కి వెళుతున్నారు.


వాళ్ల సంగతేంటి..!?

మరీ ముఖ్యంగా.. ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి సూపరెండెంట్ సుబ్బారెడ్డికి కరోనా లక్షణాలుండటంతో అనుమానంతో నెల్లూరు నారాయణ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా.. ఆ ప్రైవేట్ డాక్టర్‌ను కలిసిన మిగిలిన వైద్యుల సంగతేంటి..? రోగుల పరిస్థితేంటి..? అనేది ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-07T13:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising