ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే క్లాసులు ఎలా?: మంత్రి

ABN, First Publish Date - 2020-07-14T02:41:12+05:30

రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఆన్‌లైన్ క్లాస్‌లు, ఫీజుల వసూళ్ల అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే స్కూల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఆన్‌లైన్ క్లాస్‌లు, ఫీజుల వసూళ్ల అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే స్కూల్ యాజమాన్యాలు క్లాసులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ క్లాసులపై ఇప్పటికీ ఎలాంటి పాలసీ నిర్ణయం తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. ఆన్‌లైన్ క్లాసులు పెట్టాలంటే డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్ ఉండాలన్నారు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం లేదన్నారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్ క్లాసులకు స్కూల్ డ్రెస్‌లో కూర్చోవాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చింది, అలాంటి వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండా ఫీజులు కట్టమని ఎలా అడుగుతారని స్కూళ్ల యాజమాన్యాల తీరుపై మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-14T02:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising