తెలంగాణకు బస్సులపై రేపు భేటీ
ABN, First Publish Date - 2020-09-14T07:57:09+05:30
తెలంగాణకు బస్సులు నడిపే విషయంలో రెండు రాష్ర్టాల రోడ్డు రవాణా సంస్థల ఎండీల స్థాయిలో మంగళవారం సమావేశం జరగనున్నదని, అందులో పరిష్కారం లభిస్తుం
విజయవాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు బస్సులు నడిపే విషయంలో రెండు రాష్ర్టాల రోడ్డు రవాణా సంస్థల ఎండీల స్థాయిలో మంగళవారం సమావేశం జరగనున్నదని, అందులో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఇక్కడ చెప్పారు. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు రాష్ర్టాలు సమాన ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, కానీ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బస్సులను ఏపీ తగ్గించుకుని, తెలంగాణ పెంచుకోకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.
మధ్యలో ప్రైవేటు బస్సులు కూడా పెరిగే అవకాశం ఉన్నందునే తెలంగాణను బస్సులు పెంచుకోమంటున్నామని చెప్పారు. విజయవాడ, విశాఖ నగరాలలో సిటీ బస్సులు నడపడంపైనా ఆలోచిస్తున్నామని, దీనిపై ఆరోగ్యశాఖకు ప్రతిపాదించామని చెప్పారు. ఎప్పుడు అనుమతులు ఇస్తే అప్పుడు నడుపుతామన్నారు.
Updated Date - 2020-09-14T07:57:09+05:30 IST