4వ రోజుకు చేరుకున్న మెడికల్ విద్యార్థుల నిరాహార దీక్ష
ABN, First Publish Date - 2020-06-25T18:23:50+05:30
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద మెడికల్ విద్యార్థుల నిరాహారదీక్ష 4వ రోజుకు చేరింది.
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద మెడికల్ విద్యార్థుల నిరాహారదీక్ష 4వ రోజుకు చేరింది. జీవో నంబర్ 56ను పూర్తి స్థాయిలో అమలు చేసే వరకూ పోరాడుతామంటూ మెడికల్ పీజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పీజీ మెడికల్, డెంటల్ ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 56 అమలుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. యాజమాన్యాలు, విద్యార్థుల తరపున హైకోర్టు వాదనలు విననుంది. జీవో నంబర్ 56 అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ బాబు పిల్ దాఖలు చేశారు.
Updated Date - 2020-06-25T18:23:50+05:30 IST