గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్ల వరకు సడలింపు
ABN, First Publish Date - 2020-06-18T08:28:22+05:30
ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లకు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 8 సంవత్సరాలపా టు సడలించింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉం డగా
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లకు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 8 సంవత్సరాలపా టు సడలించింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉం డగా.. దాన్ని 42 ఏళ్ల వరకు పెంచింది. అయితే యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ప్రిజన్స్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్టు శాఖలకు సంబంధించి భౌతిక ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ఈ సడలింపు వర్తించదు. ఆయా ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచింది. ఏపీపీఎస్సీతో పాటు ఇతర రిక్రూటింగ్ ఏజన్సీలన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. 2021 సెప్టెంబరు 30 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల వరకు పెంచింది. అప్పటి ఉత్తర్వుల ప్రకారం పెంపు 2019 సెప్టెంబరు 30తో ముగిసింది.
Updated Date - 2020-06-18T08:28:22+05:30 IST