ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం’

ABN, First Publish Date - 2020-09-25T19:15:00+05:30

అమరావతి: గిట్టుబాటు ధరలు లేక దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గిట్టుబాటు ధరలు లేక దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పేర్కొన్నారు. మోదీ నిర్ణయాలతో దేశంలో జీడీపీ పతనమైందన్నారు. కార్పొరేట్ శక్తులు ఎంతైనా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చనే కేంద్రం నిర్ణయం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో పెట్టిన అన్ని సంక్షేమ పథకాలనూ పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మస్తాన్ వలి పేర్కొన్నారు. మోదీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ 26వ తేదీన స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 28న 500 మందితో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. అక్టోబర్ 2న విశాఖపట్నంలో కిసాన్ మజ్దూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 


రైతాంగ బిల్లుకి వ్యతిరేకంగా అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

Updated Date - 2020-09-25T19:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising