ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం

ABN, First Publish Date - 2020-09-19T09:16:36+05:30

జోరుగా వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, నెల్లూరు రూరల్‌, తాడేపల్లి టౌన్‌, సెప్టెంబరు 18: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరప్రాంత గ్రామాల్లో  కొబ్బరి, సరుగుడు తోటలు, పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్‌ మండలం పొట్టేపాళెం వద్ద పెన్నా నదిలోని లంకదిబ్బలో వెంకటరమణయ్య (50) అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అగ్నిమాపక శాఖ 4 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి సాయంత్రం 6 గంటలకు ఆయన్ను ఒడ్డుకు చేర్చారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా వరద జలాలు వస్తుండడంతో మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 4లక్షల 33 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ జేఈ దినేష్‌ తెలిపారు. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో నాగార్జునసాగర్‌ 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.  

Updated Date - 2020-09-19T09:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising