ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసురు తీసిన మద్యం

ABN, First Publish Date - 2020-07-01T08:39:29+05:30

సర్కారీ మద్యం అంగడి వద్ద మండుటెండలో క్యూలో నిలబడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం రైల్వే గేటు సమీపంలోని మద్యం షాపు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యూలో నిలబడి గుండెపోటుతో వ్యక్తి మృతి


పాలకొల్లు, జూన్‌ 30: సర్కారీ మద్యం అంగడి వద్ద మండుటెండలో క్యూలో నిలబడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం రైల్వే గేటు సమీపంలోని మద్యం షాపు వద్ద మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మద్యం అమ్మకాల్ని పరిమితం చేశారు. పన్నెండు గంటల ప్రాంతంలో మద్యం కొనుగోలుకు క్యూలో నిలుచున్న స్థానిక బెత్లెహాం పేటకు చెందిన బాలం నాగేశ్వరరావు (52) ఒక్కసారిగా ఛాతీ పట్టుకుని కూలబడిపోయాడు.  క్యూలో నిలుచున్న వారు సపర్యలు చేసే లోపే ప్రాణాలు విడిచాడు. గుండెపోటుతో మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం, బంధువులు సైతం కేసు వద్దని మృత దేహాన్ని అప్పగించాలని కోరడంతో నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించకుండా బంధువులకు అప్పగించారు. 

Updated Date - 2020-07-01T08:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising